English | Telugu

కిల్లింగ్ వీరప్పన్...ఔట్ స్టాండింగ్ : అమితాబ్ ట్వీట్

తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.

రీసెంట్ గా సినిమా ట్రైలర్ చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ 'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు అమితాబ్ ఒక తెలుగు సినిమా గురించి ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. దీని గురించి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ''అమిత్ జీ నేను రియల్ స్టోరీస్ తీయడంలో దిట్ట అని నమ్మే వ్యక్తి. నాకు తెలిసి ఆయనకు సినిమాలో ఉన్న అసాధారణమైన ఊహాచిత్రాలు, ఫిలిం యొక్క ఇంటెన్సిటీ బాగా నచ్చినట్లుంది' అని తన అభిప్రాయం వెల్లడించారు.

శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞాశెట్టి, పరూల్ యాదవ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సధీర్ చంద్ర పధిరి; నిర్మాతలు:బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.