English | Telugu
భగవంత్ కేసరి ప్రీమియర్ షో తో సింగపూర్ లో బాలయ్య ల్యాండ్.. తెల్లవారుజామున 2 .30
Updated : Oct 18, 2023
నందమూరి నట సింహం యువరత్న నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న తాజా క్రేజీ మిస్సైల్ మూవీ భగవంత్ కేసరి. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల అవ్వబోతున్న భగవంత్ కి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడంతో పాటు బాలయ్య అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది
బాలయ్య సినిమా విడుదల అవుతుందంటే చాలు ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం మొదలవుతుంది. సూర్యోదయానికి ముందే థియేటర్ లో బెనిఫిట్ షో లు పడతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు బాలయ్య ప్రతి సినిమాకి కామనే. కానీ ఇప్పుడు సింగపూర్ లో బాలయ్య అభిమానుల హడావిడి ముందుగా ప్రారంభం కాబోతుంది. రేపు అంటే ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 .30 గంటలకి భగవంత్ కేసరి సినిమా ప్రీమియర్ షోస్ సింగపూర్ లో పడనున్నాయి. వెయ్యి సీట్ల సామర్ధ్యం కలిగి ఉన్న థియేటర్ లో బాలయ్య సింహంలా గర్జించబోతున్నాడు. అంటే బాలయ్య నట విశ్వరూపాన్ని సింగపూర్ ప్రజలు మన కంటే ముందు చూడబోతున్నారు. దీంతో సింగపూర్ లో ఎక్కడ చూసినా బాలయ్య ఫీవరే కనపడుతుంది.
భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. ట్రైలర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అయితే సూపర్ గా ఉండి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఆసక్తిని భగవంత్ కలిగించాడు. అలాగే బాలయ్య మొట్టమొదటి సారిగా తెలంగాణ యాసలో భగవంత్ కేసరి మూవీలో డైలాగ్స్ చెప్పడం తో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో బాలయ్యకి జోడిగా కాజల్ జతకట్టింది. శ్రీ లీల బాలయ్యకి కూతురిగా నటించిందని వార్తలు వస్తున్న ఈ మూవీలో ప్రముఖ హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు.