English | Telugu
డైరెక్టర్ టార్చర్ వల్ల.. సెట్స్ నుంచి వెళ్లిపోయాను : జెనీలియా
Updated : Oct 18, 2023
సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు, దర్శకనిర్మాతల మధ్య ఎన్నో విభేదాలు, మరెన్నో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అయితే వాటన్నింటినీ స్పోర్టివ్‌గా తీసుకున్నప్పుడే సినిమా ఔట్‌పుట్ బాగా వస్తుంది. సాధారణంగా వాళ్ళు కూడా చిన్న చిన్న ఘటనలను లైట్‌గానే తీసుకుంటారు. అయితే తమకు షూటింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందులను ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత గానీ బయటపెట్టరు. తాజాగా అలాంటి ఓ అనుభవాన్ని హీరోయిన్ జెనీలియా వెల్లడిరచింది.
2012లో వచ్చిన ‘నా ఇష్టం’ చిత్రం తర్వాత పెళ్ళి చేసుకున్న జెనీలియా ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది. నా ఇష్టం తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఇతర భాషా చిత్రాలతో బిజీ అవుతున్న జెనీలియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో భాస్కర్ తనను టార్చర్ పెట్టాడని, అతని వల్ల నిద్రలేని రాత్రుళ్ళు గడపాల్సి వచ్చిందని తెలియజేసింది.
‘‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిదార్థ్‌తో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం నన్ను రప్పించారు. రాత్రుళ్లు షూటింగ్ కావడంతో ఆ సీన్ సరిగ్గా రావడం కోసం మూడు రోజుల పాటు షూటింగ్ చేశారు. అలా మూడు రోజుల పాటు నిద్ర లేకుండా గడిపాను. భాస్కర్ టార్చర్ భరించలేక షూటింగ్‌కు రానని చెప్పి వెళ్లిపోయాను. రెండు రోజుల పాటు సెట్స్‌కు వెళ్ళలేదు. నా స్నేహితుడు అల్లు అర్జున్ నచ్చజెప్పడంతో తిరిగి షూటింగ్ పూర్తి చేశాను’ అంటూ ‘బొమ్మరిల్లు’ షూటింగ్‌లో తను పడిన ఇబ్బందుల గురించి వివరించింది జెనీలియా.
