English | Telugu

బాలయ్య, మోక్షజ్ఞల సినిమాలపై బోయపాటి కామెంట్స్

బాలకృష్ణ నటించబోయే 100వ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు అని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి స్పందిస్తూ..."బాలకృష్ణతో మరో సినిమా చేస్తాను. కానీ అది ఎప్పుడన్నది మాత్రం తెలియదు. ఆయనకు తగిన కథ ఇపుడు నా దగ్గర లేదు. మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి కథ దొరకగానే సినిమా మొదలుపెడతా. కానీ అది బాలయ్య వందవ సినిమానా లేక మరొకటా అనేది నాకు తెలీదు. బాలయ్య కూడా అంకెల ప్రస్తావన ఎప్పుడు మాట్లాడరు. కేవలం మంచి కథ మాత్రమే చూస్తారు. అలాగే మోక్షజ్ఞ కూడా నా దర్శకత్వంలోనే తెరకు పరిచయం కాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. మోక్షజ్ఞ తెరపైకి రావడానికి ఇంకా మూడేళ్ళు సమయం పడుతుంది. అప్పటి పరిస్థితులని బట్టి బాలయ్య నిర్ణయం తీసుకొంటారు." అని అన్నారు. ఈ వార్త బాలయ్య అభిమానులకు కాస్త నిరాశని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.