English | Telugu

జై రాజమౌళి.. జైజై రాజమౌళి

రాజమౌళి బాహుబలి సినిమా ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాతల కష్టాలను దూరం చేసింది. ఈ సినిమాకి ముందు భారీ లాస్ లలో వున్న వారు సైతం గట్టెక్కించింది. దిల్ రాజు బహుబలికి ముందు పంపిణీలోనూ, నిర్మాణంలో ఏ సినిమాలు కలిసిరాక అప్పులో ఇరుక్కుపోయారు. బాహుబలి సినిమా పంపిణి తరువాత మళ్ళీ లాభాల్లోకి వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా ఊహించిన దాని కంటే నైజాం భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో దిల్ రాజు మళ్ళీ తన మార్క్ సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ చెప్పబడే యువి క్రియేషన్స్ జిల్ సినిమాతో కష్టాలను కొని తెచ్చుకున్నారు. బాహుబలి దెబ్బకి ఊపిరి పీల్చుకొని గట్టెక్కారు. అలాగే ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ది అదే తీరు. ఆయనకైతే బాహుబలి మళ్ళీ కొత్త లైఫ్ ఇచ్చిందని అంటున్నారు. ఎన్నో సినిమాల దెబ్బలతో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో వున్న ఆయన్ని ఒక్క దెబ్బతో బయటకు లాగేసింది. ఇప్పుడు ఆయన కాలరెత్తుకు తిరగేస్తున్నారు.

బాహుబలి వల్ల ఒక్కరేమిటి క్యాంటీన్లు, పార్కింగ్ ఇలా థియేటర్ల మీద బతికే ప్రతి ఒక్కరూ మంచి ఆదాయాన్ని సంపాదించారు. దాంతో ప్రతి సంవత్సరం తమ కష్టాలను దూరం చేసే బాహుబలి లాంటి సినిమా ఒక్కటైన రావాలని కోరుకుంటున్నారు. మరి ఇంతమంది కష్టాలను దూరం చేసిన జక్కన్న కి జై కొట్టాల్సిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.