English | Telugu

ఎయిర్ పోర్ట్ దగ్గర సాయిధరమ్ పిల్లా

సాయిధరమ్ తేజ్, రేజీనా జంటగా నటిస్తున్న చిత్రం "పిల్లా నువ్వులేని జీవితం". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ ఎదురు రోడ్డు, ఎం.సిటీ.ఏ బిల్డింగ్ లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీవాసు, హర్షిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...