English | Telugu

అవతార్ 3 లేటెస్ట్ అప్ డేట్ ఇదే..చెప్పకపోతే మీ డబ్బులు వృధా చేసిన వాడినవుతాను    

ప్రపంచ సినీ పితామహుడిగా అభివర్ణించబడే ప్రఖ్యాత దర్శకుడు'జేమ్స్ కామెరూన్'(James cameron)గురించి ప్రపంచ సినీ ప్రియులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.తనకి మాత్రమే సాధ్యమయ్యే సృజనాత్మకతతో,ఎన్నో వండర్ సినిమాలని సృష్టించి,ప్రేక్షకుల మనస్సులో చిర స్థాయిగా నిలిచిపోయాడు.విజువల్ ఎఫెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో జేమ్స్ కామెరూన్ మంచి దిట్ట.పైగా ఆ విజువల్స్ అన్ని కూడా కథతో ఇమిడి ఉండటం కూడా ఆయన స్టైల్.ది టెర్మినేటర్, ఎలియెన్స్,టెర్మినేటర్ 2 ,టైటానిక్,అవతార్,(Avathar)అవతార్ 2 వంటి పలు చిత్రాలే అందుకు ఉదాహరణ.ఇప్పుడు 'అవతార్ 3(avathar 3)ఫైర్ అండ్ యాష్' ని తెరకెక్కిస్తున్నాడు.మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1950 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనుండగాప్రస్తుతం ఆ మూవీ చిత్రకరణ దశలో ఉంది.

రీసెంట్ గా కామెరూన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు అవతార్ పార్ట్ 1 ,పార్ట్ 2 కంటే పార్ట్ 3 నిడివి ఎక్కువగా ఉండబోతుంది. రెండు పార్ట్ ల్లో చూడని విజువల్స్ ని కూడా ప్రేక్షకులు పార్ట్ 3 లో చూస్తారు.దైర్యంతో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను.అలా దైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రేక్షకుల డబ్బు,సమయాన్ని వృధా చేసినవాడినవుతాను.భిన్నమైన కథనం,విభిన్నమైన పాత్రలని అవతార్ 3 లో చూడబోతున్నారని చెప్పుకొచ్చాడు.అవతార మొదటి రెండు పార్ట్ ల్లో కామెరూన్ ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించిన నేపథ్యంలో పార్ట్ 3 లో సృష్టించబోయే ప్రపంచం ఎలా ఉండబోతోందనే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఉంది.

ఇప్పటికే రిలీజైన చిన్నపాటి టీజర్ అయితే యు ట్యూబ్ ని షేక్ చేస్తుంది.పార్ట్ 3 2025 డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుండగా,పార్ట్ 4 ,పార్ట్ 5 లు కూడా ఉన్నాయి. 2029 వ సంవత్సరంలో ఒకటి, 2031 డిసెంబర్ లో ఒకటి విడుదల కానున్నాయి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.