English | Telugu
బరువెక్కుతున్న అనుష్క అందాలు
Updated : Jun 13, 2014
అరుంధతి చిత్రం తర్వాత జానపద చిత్రాలకు, రాజసం ఉట్టి పడే రాణి తరహా పాత్రలకు, పవర్ ఫుల్ హిస్టరీ నేపథ్యం వున్న చిత్రాలకు అనుష్కను మించిన వారెవరూ లేరని తేలిపోయింది. దాంతో రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క చక్కటి పాత్రల్లో నటిస్తోంది.
అయితే తాజాగా అనుష్కను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారట ఆమె రూపు రేఖలని చూసి..
అనుష్క ఇలా తయారైందేమిటి అని ముక్కున వేలేసుకున్నారట, మలేషియా ఎయిర్‌పోర్ట్ లో జేజమ్మను చూసినవారంతా.. చక్కనమ్మా చిక్కినా అందమే అంటుంటారు. కాని అదే కొంచెం బొద్దుగా అయితే మాత్రం, నెక్స్ట్ ఛాన్స్ రాదేమో అనే టాకు మొదలవుతుంది చిత్రసీమలో. అలాంటిది అనుష్క ఇలా మందంగా తయారవ్వటం వెనుక కారణమేంటో మరి...
ప్రస్తుతం అనుష్క తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ పక్కన హీరోయిన్ గా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం మలేషియా వెళుతున్న అనుష్క, అజిత్ లను కొందరు అభిమానులు ఏయిర్ పోర్టులో పలకరించి, కెమెరాతో క్లిక్‌మనిపించారు.
ఈ ఫోటోలో స్వీటిని చూసిన వారంతా, ఈ బ్యూటీ కొంచెం బొద్దుగా తయారైనట్లుంది అని అనుకుంటున్నారు. దీనికి తోడు అనుష్క హెయిర్ స్టైల్ కూడా కాస్త విచిత్రంగానే వుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. బేసిక్ గా యోగా చేసే అనుష్క ఇలా షేప్ లెస్ గా ఎందుకు తయారైందో అని ఆశ్చర్యపోతున్నారు. తమిళ చిత్రాల్లో భామలు కొంచెం బొద్దుగానే ఉంటారని, ఉండాలని అనుష్క కూడా భావించడం మొదలు పెట్టిందంటారా... !!