English | Telugu
మాస్ ప్రేక్షకులకు సంక్రాంతి మాస్ మసాలాలు...!
Updated : Jan 9, 2023
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య,నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహా రెడ్డి ఒక్కరోజు గ్యాప్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ రెండు చిత్రాలను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నడంతో ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకులను చూపు నిలిచి ఉంది. ఈ రెండు చిత్రాలు మాస్ మసాలా మూవీలుగా మాస్ అభిమానులకు డబుల్ బొనాంజాగా రానున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్క వాల్తేరు వీరయ్య కే కాదు వీర సింహా రెడ్డి కి కూడా పూనకాలు లోడింగ్ అనేది సరిగ్గా సూట్ అవుతుంది.ఇక బాలయ్య వీర సింహారెడ్డి లో తన డైలాగులతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి,రవితేజ తో కలిసి తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ కూడా సినిమాల లాగానే ఒక రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. రెండు చిత్రాలు ట్రైలర్స్లో ను కథను ఏమాత్రం రివీల్ చేయలేదు. అయినా కథతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ రెండు కేవలం అటు ఇటు గా రొటీన్ సినిమాలే అయినా డిఫరెంట్ మేకింగ్ తో మాస్ జాతర జరిగేలా వస్తున్నాయి.
ఒకప్పుడు గోపీచంద్ మలినేని దగ్గర బాబి రచయితగా పని చేసేవారు. ఇప్పుడు అదే గోపీచంద్ మలినేని బాలయ్య వీరసింహారెడ్డి కి దర్శకుడు కాగా బాబి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు దర్శకుడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి మాస్ జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బాలయ్యకు వీరసింహారెడ్డి మరో సమరసింహారెడ్డి అవుతుందని అనిపిస్తుండగా, వాల్తేరు వీరయ్యలో మనం ముఠామేస్రి, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వంటి వింటేజ్ చిరు కనిపించనున్నారు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవిని చూస్తుంటే మాసిజానికి సరిహద్దు అనేది లేకుండా పోయింది... ఆయనలోని ఎనర్జీ, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. బాస్ ఇస్ బ్యాక్ అన్న టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎలివేషన్ కామెడీ సన్నివేశాలు గూస్ బంప్స్ అనిపించేలా డైలాగులు ఆద్యంతం వ్యక్తిగట్టిస్తున్నాయి. అతడు ఒక డ్రగ్ స్మగ్లర్. డిపార్ట్మెంట్ డేటాబేస్ లో అతడు ఒక పాపులర్ ఖైది. హి ఈజ్ ఏ మాన్ స్టర్ అని ట్రైలర్ ప్రారంభమైంది. నీ కథలోకి నేను రాలా... నా కథలోకే మీరందరూ వచ్చారు... మీరే నా ఎర.... నువ్వే నా సొర అనే మెగాస్టార్ డైలాగ్ అభిమానుల్లో పూనకాలు పుట్టించేలా ఉంది. మాస్ పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయనను సూసి అంటూ చిరంజీవిలోని మాసిజాన్ని మరోలెవల్లోనికి తీసుకొని పోయారు.
ఇక మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ లెవెల్. వైజాగ్ సిటీలో అరాచకాలను ఆపేందుకు వచ్చి పోలీస్ కమిషనర్ గా రవితేజ కనిపించారు. హలో బాసు కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ గ్యాంగ్ లీడర్ డైలాగ్ ని రవితేజ పలుకుతుంటే మరో లెవల్‌లో అది ఉంది. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. వీరసింహారెడ్డిలో సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.... మార్చలేరు.....వంటి పంచ్ డైలాగ్‌లు అదిరే లెవల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో థియేటర్ ప్రేక్షకులు రావాలంటే బాగా ఎంటర్టైన్ చేయగలగాలి. అందుకు స్టార్ హీరోలు అయి ఉండాలి. అదే మామూలుగా అయితే ఓటీటీలో చూసేద్దాం.. ఏముందిలే అనుకుంటారు. కానీ రెండు చిత్రాలు ఆ తరహాలో లేవు. వీటిని బిగ్ స్క్రీన్ పై చూస్తేనే మజా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రైలర్లను చూస్తేనే ప్రేక్షకులకు ఆ విషయం అర్థమైపోతోంది. ఇక ఈ రెండు చిత్రాలలోనూ శృతిహాసన్ హీరోయిన్. ఒకపక్క చిరుతో ఆడుతూ పాడుతూ మరోవైపు బాలయ్యతో చిందులేస్తుంది. కాబట్టి ఆమె అభిమానులు రెండు చిత్రాలను చూసేస్తారు. ఇక ఈ రెండు చిత్రాలకు పోటీగా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా వారసుడుతో వస్తున్నారు. అయితే వారసుడు పోస్ట్ పోన్ అయ్యింది అని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి ఏ మాత్రం అవకాశం దొరకకుండా వీరయ్య, వీర సింహా రెడ్డి లు బరిలోకి దిగి కోడిపుంజుల్లా సందడి చేయడం... సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే అవి కూడా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం. మరి ఈ రెండు చిత్రాలకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయి? ఈ చిత్రాలలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి...!