English | Telugu

త్వరలో కొత్త సీరియల్ అమ్మోరు..బ్రహ్మముడి శ్రీప్రియ కూతురు లాంఛ్


ఈటీవీలో త్వరలో అమ్మోరు అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ సీరియల్ లో కల్కి, చరిష్మా నటిస్తున్నారు. వీళ్ళతో ఒక చిట్ చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పారు ఇద్దరూ. "హలో అండి నా పేరు క‌ల్కి రాజా. పాశర్లపూడి నా విలేజ్. నేను అమలాపురం కుర్రోడిని" అని చెప్పాడు. "నా పేరు చరిష్మా శ్రీకర్. తెలుగు అమ్మాయినే. నేను పుట్టింది హైదరాబాద్. కానీ మా పేరెంట్స్ వాళ్ళది ఆంధ్రా, విజయవాడ, గుంటూరు ఆ సైడ్ నుంచి వచ్చారు. మా మదర్ ఫాదర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. మా అమ్మ శ్రీప్రియ. ఆమె కూడా నటి. మీరెన్నో సీరియల్ లో చూసుంటారు. డాడీ కూడా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. చిన్నప్పటి నుంచి ఇదే బ్యాక్‌గ్రౌండ్‌లో పెరగడం వల్ల నాకు కూడా దీని మీద ఇంటరెస్ట్ కలిగింది. నేను ఇంతకుముందు మూవీస్ చేశాను. ఇప్పుడు అమ్మోరు సీరియల్ ద్వారా లాంచ్ అవుతున్నాను" అని చెప్పింది. "అమ్మోరు సీరియల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ?" అని హోస్ట్ అడిగింది. "మొదటి రోజు షూట్ కి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది. ప్రతీ చిన్న పాయింట్ ని కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నారు.


నా బాడీ మీద ఉన్న టాటూస్ దగ్గర నుంచి అన్ని విషయాల గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి అప్రూవల్ తీసుకుని ఆయన ఓకే అన్న తర్వాత షూట్ చేస్తున్నారు. అందుకే ఈ సీరియల్ నేనే నేనే చేయాలి అనుకున్నారు. టీజర్ లాంఛ్ అయిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పాడు. "నేను అమ్మోరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను మూవీస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి మూవీస్ మీద ఇంటరెస్ట్ ఉంది. మూవీస్ చేస్తూ ఉంటే మమ్మీ, డాడీ సర్కిల్ అంతా ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు నన్ను సీరియల్స్ చేయమని అడిగారు నన్ను. నాకు మూవీ సైడే ఇంట్రెస్ట్ ఉండేసరికి సీరియల్స్ ఎందుకు అని చెప్పేసి చాలా రోజులు ఆపుకుంటూ వచ్చాను. బట్ ఈ అమ్మోరు ప్రాజెక్ట్ మల్లెమాల నుంచి నా కాల్ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ హావ్ నో అదర్ రీజన్ అంటే నో చెప్పడానికి అసలు రీజన్ అనేది దొరకలేదు. ఫస్ట్ ఈటీవీ తర్వాత లెజెండరీ మూవీ అమ్మోరు అనేది. దాంట్లో ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను లాంచ్ అవడం అనేది అదృష్టం అనుకోని నేను ఈ సీరియల్ చేయడానికి ఒప్పేసుకున్న" అని చెప్పింది. "అమ్మోరు సీరియల్ షూట్ లో మీరు ఫస్ట్ చేసిన కెమెరా సీన్ ఏంటి " అని అడిగింది హోస్ట్. " ఫస్ట్ సీనే భయంకరంగా ఉంది. పెద్ద ముగ్గేశారు పుర్రె పెట్టారు. ఆ లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ కి నాకు 12 గంటలు పట్టింది. ఆ గెటప్ లో టచప్ చేసుకోవాలి అన్నా కూడా భయం వేసింది" అని చెప్పాడు.

"నాకు నా ఫస్ట్ సీన్ వచ్చేసి చాలా నీట్ గా క్యూట్ గా ఉండే ఇంట్రడక్షన్ . అమ్మవారికి పూజ చేయడం ఇలా జరిగింది. పాజిటివ్ గా చాలా బాగుంది. కానీ ఈ సీరియల్ లో ఇప్పటి వరకు అంటే చేసిన వర్కింగ్ డేస్ తక్కువైనా కానీ వింటర్ లో అభిషేకాలు, వాటర్ పోయడము, చలి, నైట్ కాల్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. టెలికాస్ట్ అప్పుడు మిస్ అవ్వకుండా చూడండి." అని చెప్పింది. చరిష్మా ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ అపర్ణ దేవి రోల్ లో నటిస్తున్న శ్రీప్రియ శ్రీకర్ కూతురు. ఈ అమ్మోరు సీరియల్ ఈ ఫిబ్రవరి 16 నుంచి ఆ రాత్రి 7:30 నిమిషాలకి నుంచి ప్రసారం కాబోతోంది.

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.