English | Telugu

నిఖార్సయిన జర్నలిస్ట్ కథే ఈ ‘సెటిల్ మెంట్’

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన 'చిలక్కొట్టుడు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేసారు అచ్చన శ్రీనివాస యాదవ్. ఆ తర్వాత 13 సినిమాలకు వివిధ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా, కోడైరెక్టర్ గా వర్క్ చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'ఫ్రెండ్స్ కాలనీ' చిత్రంతో దర్శకుడిగా మారిన అచ్చన శ్రీనివాస యాదవ్ కొద్ది కాలంగా సినిమాలను పక్కన పెట్టి బుల్లితెరపై సీరియల్స్ కుక్రియేటివ్ హెడ్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా కొన్ని పాపులర్ బ్రాండ్లకు వర్క్ వర్క్ చేసి అందరి మన్ననలు పొందారు. ఇక తాజాగా కమర్షియల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ భారీ చిత్రానికి అచ్చన శ్రీనివాస యాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'సెటిల్ మెంట్'. ఎ జర్నలిస్ట్ జర్నీ అనేది ట్యాగ్ లైన్. ఈ సందర్భంగా దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తో జరిపిన చిట్ చాట్ మీకోసం...

ఈ మధ్య సినిమాకు దూరమైనట్టున్నారు?

మీరన్నది నిజమే. సినిమాలకు కొద్ది కాలంగా దూరంగా ఉన్నాను, కానీ కళామతల్లికి దూరం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా టీవీ సీరియల్స్, ప్రముఖ బ్రాండ్ల కోసం యాడ్ ఫిల్మ్ లు తీస్తున్నాను.

టీవీ సీరియల్స్ అంటే చేతినిండా పని కదా. వాటిని వదిలి మళ్లీ సినిమాల వైపుకు ఎందుకు వస్తున్నారు?

నేను బేసిక్ గా కళాకారుణ్ణి. మాకు సినిమాలు, టీవీలు, యాడ్స్, ఇవి తప్ప ఇంకోటి అంటూ ఉండవు. ఎక్కడైనా నేను చేసే పని ఒకటే. కాకపోతే ఆ ప్లాట్ ఫామ్ ను బట్టి వ్యూయర్షిప్ ఉంటుంది. మీరన్నట్టు ఇప్పుడు టీవీ సీరియల్స్ మంచి రైజ్ లో ఉన్నాయి. కానీ అక్కడ ఉండే రాజకీయాలు.. మన దేశం మొత్తం మీద భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. అక్కడ అసలు పనికన్నా.. ఎదుటివాడి కుర్చీ లాగే కార్య క్రమాలకే పెద్ద పీట. ఆ కుర్చీలాటలో నేను ఇమడలేను, అందుకే సీరియల్స్ కు దూరంగా జరిగి యాడ్స్ చేస్తున్నాను. టెలీ ఫిలింస్ కొన్ని, ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పని చేశాను.

మళ్లీ మెగాఫోన్ పట్టి 'సెటిల్ మెంట్ ' అంటున్నారు? పైగా 'ఎ జర్నలిస్ట్ జర్నీ' అని జర్నలిస్ట్ లనే టార్గెట్ చేశారు?

ఒక జర్నలిస్ట్ జీవితం నేపథ్యంలో సాగే కథ ఇది. వారిని నెగెటివ్ గా చూపించట్లేదు. వారిపట్ల నాకూ గౌరవమే. నా కెరీర్ కూడా జర్నలిస్టుగానే మొదలైంది. నిజమైన జర్నలిజానికి కట్టుబడిన జర్నలిస్ట్ పెన్ను.. గన్ను కన్నా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించబోతున్నాను.

ప్రొడ్యూసర్, హీరో, ఇతర టెక్నీషియన్స్ వివరాలు?

ఈ సినిమాని ఎస్.వి.ఎస్. ఫిలిం ఫ్యాక్టరీ అని ముంబాయి బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. మొదట చిన్న సినిమా చేద్దామనుకున్నా. మా నిర్మాతలకు కథ బాగా నచ్చడంతో వారు లార్జ్ స్కేల్ లోనే ప్లాన్ చేశారు. హీరోగా కన్నడంలో వరుసగా మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన యువ హీరోను తీసుకున్నాం. 3 సాంగ్స్ రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. సంగీత దర్శకుడు శ్రీవెంకట్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అలాగే స్క్రీన్ ప్లే మాటలు శేషభట్టర్ వేంకట రమణ రాశారు. మాటలు తూటాల్లా ఉంటాయి.

షూటింగ్ ఎప్పుడు ప్రారంభమౌతుంది?

త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నది. హైదరాబాద్, బెంగుళూరుల్లో షెడ్యూల్స్, ఉంటాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ ఏమైనా ఉందా?

ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ 'సెటిల్ మెంట్ ' నా కమ్ బ్యాక్ మూవీ.. ఇకపై నన్ను ఖాళీగా ఉంచని మూవీ ఇది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.