English | Telugu
ముచ్చటగా మూడోసారి జోడి కట్టబోతున్నారా!
Updated : Jul 9, 2025
ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)స్టార్ హీరోయిన్ 'రష్మిక'(Rashmika Mandanna)జోడి 'పుష్ప' సిరీస్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. పైగా ఆ ఇద్దరు ఒకేసారి పుష్పతోనే పాన్ ఇండియా లెవల్లో స్టార్ స్టేటస్ ని పొందారు. అది ఎంతలా అంటే వాళ్ళిద్దరి సినిమాల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేసేంతలా. దీంతో ఆ ఇద్దరి కాంబినేషన్ కి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
అల్లు అర్జున్ తన అప్ కమింగ్ మూవీని 'అట్లీ'(Atlee)డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో రష్మిక మరోసారి అల్లు అర్జున్ తో జత కడుతుందనే వార్తలు వస్తున్నాయి. మేకర్స్ రష్మిక ని సంప్రదించి, ఆమె క్యారక్టరేజేషన్ గురించి చెప్పారని, రష్మిక కూడా సానుకూలంగా స్పందించిందని అంటున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా తెలుస్తుంది. రష్మిక ఈ ప్రాజెక్ట్ లో నటించడం ఖాయమైతే, అల్లు అర్జున్,రష్మిక జోడి మూడోసారి అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినట్లే. రష్మిక చేతిలో ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, మైసా అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఉన్నాయి, ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ ముగింపు దశలో ఉండగా, మైసా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానాతో చేసిన 'థామా' విడుదలకి సిద్ధంగా ఉంది.
ఇక అల్లు అర్జున్, అట్లీ మూవీ ఈ నెల చివరి వారంలో గాని లేదా ఆగష్టు మొదటి వారంలో గాని సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు తెరకెక్కని ఒక సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ముగ్గురు హీరోయిన్లుకి చోటు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'దీపికా పదుకునే'(Deepika Padukune)ని అధికారకంగా అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెపై చిత్రీకరించిన వీడియో ఎంతో ఆసక్తిని కూడా కలిగించింది. మిగతా ఇద్దరి హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur),జాన్వీ కపూర్(Janhvi Kapoor) పేర్లు వినిపించాయి. మృణాల్ ఠాకూర్ దాదాపుగా ఖాయమయినట్లే. జాన్వీ కపూర్ ప్లేస్ లోనే రష్మిక పేరు ఇప్పుడు బయటకి వచ్చింది. సన్ పిక్చర్స్(Sun Pictures)పై కళానిధి మారన్(Kalanithi Maran) అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
