English | Telugu

విదేశాల్లో ఆటోలో షికార్లు చేస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ

అల్లు అర్హ.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరేమో. తన ఇంటి పేరుకి ఎంత పవర్ ఉందో ఇనిస్టా లో తను చేసే వీడియోస్ కి కూడా అంతే పవర్ ఉంది. అల్లు అర్జున్ కూతురుగా అందరికి పరిచయమైన అర్హ ఇప్పుడు తన కంటు సొంతంగా అభిమానులని సంపాదించుకుంది. అలాగే అల్లు అర్జున్, స్నేహలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అర్హ వీడియోస్ కి ఎక్కువ సంఖ్యలో లైక్స్ కూడా వస్తుంటాయి. తాజాగా అర్హ కి సంబంధించిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది.

అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని జరుపుకోవడానికి విదేశాలకి వెళ్ళాడు.బన్నీ అక్కడే నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకొని ఆ తర్వాత హైదరాబాద్ కి తిరిగి వస్తాడు. ఇప్పుడు విదేశాల్లో అల్లు అర్హ ఆటోలో ప్రయాణిస్తున్న పిక్ ఒక దాన్ని స్నేహ నిన్న తన ఇనిస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది .అంతే నిమిషాల వ్యవధిలో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. ఆపిక్స్ చూసిన వాళ్లంతా అర్హ ఎలాగు హైదరాబాద్ లో ఆటో లో వెళ్ళలేదు.కనీసం ఇప్పుడు విదేశాల్లో అయినా తనకి ఆ అదృష్టం దక్కిందని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఆటోలో అర్హ తో పాటు ఆమె అన్నయ్య అయాన్ కూడా ఉన్నాడు.