English | Telugu

ముదిరిన మెగా వార్.. మా తాతయ్య లేకపోతే ఇది మీ బతుకు.. బన్నీ షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 'మెగా వర్సెస్ అల్లు' వార్ కి దారితీసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అండగా నిలబడితే.. అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం.. ఓ వైపు పవన్ కి మద్దతుగా ట్వీట్ చేసి, మరోవైపు నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి టైంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కూడా సోషల్ మీడియా వేదికగా.. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు.. మావాడైనా పరాయివాడే." అంటూ చేసిన కామెంట్స్ బన్నీ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో 'మెగా వర్సెస్ అల్లు' వార్ మరింత ముదిరింది. ఇక ఇప్పుడు నాగబాబుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ అంటూ వచ్చిన తాజా న్యూస్ తో.. ఈ ఫైట్ మరోస్థాయికి వెళ్ళింది.

నాగబాబుని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది. అందులో "తన తాతగారు అల్లు రామలింగయ్య లేకపోతే.. నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్ లో పని చేసుకునేవాడు." అంటూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా ఉంది. కానీ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం.. ఆ ట్వీట్ కనిపించడం లేదు. దీంతో బన్నీ ఆవేశంలో ట్వీట్ చేసి, ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు మెగా, అల్లు అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు.

అయితే నాగబాబుని టార్గెట్ చేస్తూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. మెగా-అల్లు మధ్య దూరాన్ని పెంచడం కోసం ప్రత్యర్థులు కావాలని.. ఒక ఫేక్ ట్వీట్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారని సమాచారం. అల్లు అభిమానులతో పాటు కొందరు మెగా ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్ ని నమ్మడంలేదు. అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్ గా తెలిసీ తెలియకుండా వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ.. అతను ఇలా మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేసే రకం కాదని వారు అంటున్నారు. చిరంజీవి (Chiranjeevi) సహా మెగా ఫ్యామిలీలోని అందరిపై బన్నీకి ఎంతో గౌరవం ఉందని, అసలు అతను ఇలాంటి చీప్ కామెంట్స్ చేసే అవకాశమే లేదని చెబుతున్నారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.