English | Telugu
తాతని పరుగులు పెట్టించిన అల్లు అయాన్!
Updated : Aug 12, 2024
సినీ సెలబ్రిటీ కిడ్స్ లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. స్టార్ కిడ్స్ లా కాకుండా సాధారణ పిల్లల్లా బిహేవ్ చేస్తుంటారు. అర్హ తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో అలరిస్తుంది. ఇక అయాన్ కి అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతను చేసే ప్రతి చిన్న పనిని నెటిజెన్లు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తాజాగా తన తాతయ్య అల్లు అరవింద్ తో కలిసి క్రికెట్ ఆడి, మరోసారి వైరల్ గా మారాడు ఈ అల్లు వారసుడు. (Allu Ayaan)
బన్నీ వైఫ్ స్నేహా రెడ్డి తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని పంచుకున్నారు. అందులో అల్లు అరవింద్, అయాన్ క్రికెట్ ఆడుతున్నారు. తాత బౌలింగ్ వేస్తుండగా, మనవడు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తాతను పరుగులు పెట్టించాలని చెప్పవచ్చు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాత-మనవడు కలిసి ఇలా సరదాగా ఆదుకోవడం బాగుందని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో బ్యాటింగ్ చేసేటప్పుడు అయాన్ ఆటిట్యూడ్ అదిరింది కామెంట్స్ చేస్తున్నారు.