English | Telugu

రాజ‌మౌళిపై క‌త్తిక‌ట్టాడు

రాజ‌మౌళి - ప్ర‌భాస్‌ల బాహుబ‌లి కోసం చిత్ర‌సీమ యావ‌త్తు ఎదురుచూస్తోంది. టాలీవుడ్ ఒక్క‌టే కాదు భార‌త‌దేశం మొత్తం బాహుబ‌లి ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటోంది. ఈ సినిమాలో ప‌నిచేసినా, ప‌నిచేయ‌క‌న‌పోయినా `బాహుబ‌లి లాంటి సినిమా తెలుగులో తెర‌కెక్క‌డం మ‌నంద‌రి అదృష్టం` అని అంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. అయితే ఒక్క న‌టుడు మాత్రం ఈ సినిమాపై క‌త్తిక‌ట్టాడు.

`బాహుబ‌లిని, రాజ‌మౌళిని నేను స‌పోర్ట్ చేయ‌లేను` అంటూ త‌న అస‌హ‌నాన్ని అయిష్టాన్నీ బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నాడు. ఆ న‌టుడెవ‌రో కాదు. సీనియ‌ర్ ఆర్టిస్ట్ సురేష్‌. తెలుగులో ఇంత‌మంది ప్ర‌తిభావంతులు ఉండ‌గా నాజ‌ర్‌లాంటి వాళ్ల‌కు బాహుబ‌లిలో అవ‌కాశం ఇవ్వ‌డం ఏమిటి? సాయికుమార్‌, సుమ‌న్‌లాంటి న‌టుల్ని వ‌దిలేసి ప‌ర‌భాషా న‌టులు అవ‌కాశాలు ఇస్తారా? అంటూ సురేష్ నిల‌దీస్తున్నాడు.

తెలుగులో ప‌రభాషా న‌టుల ఆధిపత్యంపై సురేష్ ముందు నుంచీ విమ‌ర్శ‌నగ‌ళం వినిపిస్తూనే ఉన్నాడు. ఈసారి బాహుబ‌లిలాంటి పెద్ద‌సినిమాని టార్గెట్ చేయ‌డం కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సురేష్ ని గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ ఏమాత్రం ప‌ట్టించుకోవడం లేదు. ఆ ఆక్రోశం ఇలా చూపించేస్తున్నాడేమో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.