English | Telugu

అందుకే క్రికెట్ ని వదిలేసాను... మూవీస్ నాకు మంచి పేరు తెచ్చాయి

మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో, అలాగే నెగిటివ్ రోల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆదర్శ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటి ఆదర్శ్ లో మరో యాంగిల్ కూడా ఉంది. అతనొక ఫేమస్ క్రికెట్ ప్లేయర్ కూడా. కానీ క్రికెట్ ని వదిలేసి మూవీస్ లోకి వచ్చారేంటి అంటూ ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా ఆన్సర్ ఇచ్చారు.

"నాకు క్రికెట్ అంటే చాలా కష్టంగా. 12 ఏళ్ళు కష్టపడ్డాను. క్రికెట్లో రిజల్ట్ రావటానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే ఈ గేమ్ లో చాలా ఇంజురీస్ అవుతాయి. నాకు అలాగే అయ్యాయి. క్రికెట్లో మనం అనుకున్నది సాధించాలి అంటే టైం పట్టేస్తుంది. అలాంటి టైంలో నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. క్రికెట్లో కన్నా సినిమాలో కాంపిటీషన్ తక్కువగా ఉంది. క్రికెట్లో అయితే 11 ప్లేయర్స్ కి మాత్రమే చాన్స్ దొరుకుతుంది. కానీ మూవీస్ లో కష్టపడే వాడికే మంచి లైఫ్ ఉంటుంది. 2007 లో హ్యాపీ డేస్ చేసాను. ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసాను. అదొక గొప్ప అచీవ్మెంట్ నాకు. అప్పట్లో డైరీ మెయింటైన్ చెయ్యాలి అని అనుకునేవాడిని, కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డైరీ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు మనకు వంద రూపాయులు వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు వస్తే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి సెటిల్ అనే మాటకు అర్ధం లేదు. మేము వెల్ సెటిల్ అని అందరు అనుకుంటారు. కాని అంత స్ట్రగుల్ లైఫ్ అయితే కాదు ఎబోవ్ ఏవరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అది ప్రాబ్లమ్ కాదు. నేను ఎప్పుడు మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేదు. నేను ఈ విషయానికి చాలా గర్వ పడుతున్నాను. మా ఫ్యామిలీలో అందరూ బిజినెస్ చేసేవారే. అప్పుడప్పుడు నాకు బిజినెస్ చెయ్యాలని అనిపిస్తుంది. కానీ మా నాన్నగారి బిజినెస్ కాకుండా వేరేవి ట్రై చేసాను కాని అవి వర్కౌట్ అవ్వలేదు. ఈ సంవత్సరంలో మంచి బిజనెస్ ఎమైనా స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాను" అంటూ తన లైఫ్ లో క్రికెట్, మూవీస్, బిజినెస్ కి సంబందించిన ఎన్నో విషయాలు చెప్పాడు ఆదర్శ్.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.