English | Telugu

అలనాటి అందమే ఈ నాటి అమ్మ

పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే కత్తి లాంటి ఆంటీలు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే పోటీ వుండేది కాదు... అందాల ఆరబోతకన్నా... తమ అందమైన నటనతోనే చిన్నా - పెద్దా, ముసలి -ముతక, మాస్ - క్లాస్ అంటూ తేడాలు ఏమీ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మురిపించి అలరించి ఆకర్షించేవారు. పెళ్లి అనే రెండు అక్షరాలతో సినీ ప్రపంచానికి కాస్తంత బ్రేక్ ఇచ్చేసిన అందమైన అందాల ఆ నాటి తారలు చాలా మందే వున్నారు. అలా దూరమైన కొంత మంది హీరోయిన్స్ మళ్లీ ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ తో తెరపైకి వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం వారు హీరోయిన్స్ గా తమ రీఎంట్రీ ఇవ్వడంలేదు... హీరో, హీరోయిన్స్ కి తల్లిగానో, అక్కగానో, వదినగానో, నటిస్తున్నారు. అంతే కాకుండా ఆ నాటి ఈ అందాల తారలు ఇనాటి హీరోయిన్స్ కు గట్టి సవాల్ విసురుతున్నారు. వయస్సుతో పాటు వారి అందం కూడా పెరుగుతోంది.

అదిరేటి అందం.. అలరించే అభినయంతో ఇప్పటి హీరోయిన్స్ కి గట్టి పోటీనే ఇస్తున్నారు... ఉదాహరణకు... ‘బాహుబలి‘ చిత్రంలో తల్లిగా నటించిన రమ్యకృష్ణ తన అందంతో పాటు అందమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. అలాగే ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తల్లిగా నటించిన సుహాసిని కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సంపాదించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతా చాలా మందే వున్నారు కావాలంటే ఈ పోటోలు చూడండి మీకే తెలుస్తోంది...

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.