English | Telugu

మరో రోబో, 24 లా రామ్ చరణ్ సుకుమార్ సినిమా..!

నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సినిమాలు రొటీన్ కు భిన్నంగా తీశాడు దర్శకుడు సుకుమార్. మహేష్ సినిమా రిజల్ట్ అటు ఇటుగా వచ్చినప్పటికీ, మంచి సినిమా అనే పేరును సంపాదించుకుంది. ఇక తారక్ నాన్నకు ప్రేమతో అయితే పేరుతో పాటు, డబ్బు కూడా తెచ్చిపెట్టింది. దీంతో ఇండస్ట్రీలో సుకుమార్ సినిమా అంటే వైవిధ్యంగా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. నెక్స్ట్ రామ్ చరణ్ తీయబోయే సినిమాను కూడా చాలా విభిన్నమైన కథతో తెరకెక్కించాలనుకుంటున్నాడట సుకుమార్. రోబో, 24 సినిమాల్లా ఈ సినిమాను కూడా పూర్తి సైఫై జానర్లో థ్రిల్లర్ లా తీయాలని డిసైడ్ అయ్యాడట.

ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం, ఇన్నాళ్లూ మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ చరణ్ కు తనలోని నటుడ్ని బయట పెట్టడానికి మంచి అవకాశం వచ్చినట్టే. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు చెర్రీ. మరో రెండు మూడు నెలల్లోనే ఈ స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసేసి, ప్రీప్రొడక్షన్ పనులు మొదలెడతారని సమాచారం. జనతా గ్యారేజ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ సినిమాకు కూడా నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారట. చిరు బర్త్ డే రోజున ఈ మూవీ ఒపెనింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చరణ్ ధృవ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే..

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.