English | Telugu

ఏప్రెల్ 8 న నాగచైతన్య, తమన్న 100% లవ్ ఆడియో

ఏప్రెల్ 8 వ తేదీన నాగచైతన్య, తమన్న 100% లవ్ ఆడియో రిలీజ్ కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ "100% లవ్" చిత్రం యొక్క ఆడియో మే 8 వ తేదీన ఘనంగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ ఏప్రెల్ 8 వ తేదీకి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి యువ హీరో ఈ చిత్ర నిర్మాత బన్నీ వాసుకి అత్యంత ఆప్తమిత్రుడు అయిన అల్లు అర్జున్ జన్మదినం. కాగా మరొక ప్రత్యేకత ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న హీరో నాగచైతన్య సోదరుడు అక్కినేని అఖిల్ జన్మదినం కూడా కావటం విశేషం. ఈ నాగచైతన్య, తమన్న "100% లవ్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నాగచైతన్య, తమన్న "100% లవ్" చిత్రాన్ని ఏప్రెల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.