English | Telugu

మే 7 నుండి నాగచైతన్య "బెజవాడ రౌడీలు"

మే 7 నుండి నాగచైతన్య హీరోగా నటించే "బెజవాడ రౌడీలు" చిత్రం ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాల కథనం. వివరాల్లోకి వెళితే యువ హీరో అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తన అసోసియేట్‍ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం "బెజవాడ రౌడీలు". విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విజయవాడలోని శక్తివంతమైన దేవినేని వర్గం, వంగవీటి వర్గాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు మీద ఈ "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్నారు.


"బెజవాడ రౌడీలు" చిత్రం "మే" నెలలో పన్నెండవ తేదీ నుండి ప్రారంభం కానుంది. అప్పుడు ప్రారంభమై 23 రోజుల పాటు విజయవాడ, గుంటూరు, ఆ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ ఎనిమిదవ తేదీ నుండి హీరో నాగచైతన్య ఈ "బెజవాడ రౌడీలు" చిత్రం షుటింగ్ లో జాయిన్ అవుతారని తెలిసింది. ఈ "బెజవాడ రౌడీలు" చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు బాపి-టుటుల్, మొహిలే సంగీతం అందిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.