English | Telugu
వంశీ చేతిలో, వెంకట్రావు చేయి ఉంచి రాజీ చేసిన సీఎం జగన్.. ఇక అంతా ఓకేనా..
Updated : Oct 8, 2020
ఈరోజు కృష్ణా జిల్లాలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ పునాదిపాడుకు చేరుకోగా.. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు కూడా అందులో పాల్గొన్నారు. అయితే సీఎం స్కూల్ లోకి వెళ్లే సమయంలో జిల్లా ముఖ్య నేతలు అయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు యార్లగడ్డ వెంకట్రావు అభివాదం చేసారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేతిలో వెంకట్రావు చేతిని ఉంచి ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. అయితే ఇదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్ కు ఏదో చెప్పే ప్రయత్నం చేయగా సీఎం మాత్రం అయన చెప్పే మాటలను వినకుండానే ఆయనను ఆప్యాయంగా పట్టుకొని కలిసి పనిచేయాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగాన్ని పక్కనే ఉన్న ఎమ్మెల్యే వంశీ చూస్తూండిపోయారు.