English | Telugu

ఏపీ సీఎం జగన్ మామగారైన డాక్టర్ గంగిరెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్ మామగారు, ఆయన భార్య భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు.సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరనున్నారు.