English | Telugu

అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న యస్ బ్యాంక్

ఒక పక్క ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల లిస్ట్ లో స్థానం సంపాదించగా మరో పక్క అతని సోదరుడైన అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. తాజాగా తనకు బాకీ ఉన్న అప్పును తిరిగి చెల్లించక పోవడంతో యస్ బ్యాంక్ ముంబైలోని అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ముంబైలోని మరో రెండు ఫ్లాట్ లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు గా యస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ తమ కు బాకీ ఉన్న 2,893 కోట్ల బకాయిని చెల్లించాలని మొన్న మేలో నోటీసు ఇచ్చి తాజాగా అనిల్ అంబానీకి చెందిన ఈ మూడు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే యస్ బ్యాంక్ దివాలా తీయడానికి ఇటువంటి లోన్ లే కారణమని తెలుస్తోంది.