English | Telugu

లోకేష్ పదవి పోతుందనే మండలి రద్దుకు అడ్డుపడుతున్న చంద్రబాబు!

గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని బాగుచేసుకునే అవకాశం భగవంతుడు ఇప్పుడు కల్పించినా చంద్రబాబు అడ్డుపడుతున్నాడంటూ రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయటానికి నిర్ణయించారని.. అందుకు కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు.

ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం జగన్ ద్వారా భగవంతుడు కల్పిస్తే దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని.. అందుకు మొన్న అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు చూస్తే అర్థమవుతుంది. గతంలో శాసన మండలి అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు తన కొడుకు పదవి పోతుందనే భయంతో యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారు మనం చూస్తున్నామని రోజా మండిపడ్డారు.