English | Telugu
సీఎం కార్యక్రమంలో నిబంధనలు గాలికొదిలేసిన నాయకులు!!
Updated : Aug 28, 2020
వైఎస్సాఆర్ వేదాద్రి ఎత్తిపోతల పధకానికి ఆన్లైన్ లో స్వయానా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు రిమోట్ ద్వారా శంఖుస్థాపన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జగ్గయ్యపేట ఎమ్యెల్యే సామినేని ఉదయభానుతో సహా వాసిరెడ్డి పద్మ తదితరులు హాజరవ్వడం జరిగింది. అయితే కార్యక్రమానికి హాజరైన వారిలో ఎవ్వరుకూడా మాస్కులు సరిగా ధరించినట్లు దాఖలాలు కనబడనేలేదు.
కొందరైతే, అసలు మాస్క్లలు లేకుండానే దీనికి హాజరైనట్లు ప్రత్యక్షగానే కనబడుతోంది. ఇక, సామజిక దూరం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
మాస్కులు దర్కించకుండా, సామజిక దూరం పాటించకుండా వినాయక వుత్సవాలనుగాని, పెళ్ళిళ్ళను గాని మరె ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి వీలులేదని, ఆలా జరిగితే దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పే ప్రభుత్వమే చివరకు వాటిని ధిక్కరించి అధికారిక కార్యక్రమాలను చేప్పట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార పార్టీ నాయకులు దీనికి ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి.
మాస్కు ధరించలేదని అనేక మంది సామాన్యమానవులకు పెనాల్టీలు విధించిన ప్రభుత్వం, స్వయంగా అధికార కార్యక్రమాలకే ఎలాంటి నిబంధనలు పాటించలేదంటే, రూల్స్ అనేవి కేవలం సామాన్య మానవులకేనా అనే ప్రశ్న తలెత్తక మానదు.