English | Telugu

ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు: బోండా ఉమా, బుద్ధ వెంకన్న 

రాష్ట్రం లో వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం మద్దతుతో ఆ పార్టీ కార్యకర్తలు విద్వంసానికి పాల్పడుతున్నారని, మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న ఆరోపించారు. మాచర్ల ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్టు చెప్పిన మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ -" మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు . మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు . కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‍ను కొట్టారు . మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారుతోంది . డీఎస్పీపై కూడా దాడి చేశారు . పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతామనుకోలేదు," అని ఉమా మహేశ్వర రావు మీడియా తో చెప్పారు. ఇదిలా ఉండగా, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ-" పల్నాడులో మా పర్యటన వివరాలను వైసీపీకి పోలీసులు అందించారు. అడుగడుగునా మాపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు," అని వివరించారు.

విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి. మాచర్లలో నామినేషన్లు వేయడంలో వస్తున్న ఇబ్బందులను మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు.కారు అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడంతో ఉద్రీక్తత నెలకొంది. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.