English | Telugu
బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణుల దాడి!!
Updated : Mar 11, 2020
వైసీపీ శ్రేణులు ఏకంగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. బోండా ఉమ, బుద్దా వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ శ్రేణులు వాటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.
నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.