English | Telugu
కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రజలకు వాతలు పెడుతున్న కేంద్రం
Updated : Mar 11, 2020
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో పెట్రో ధరలు భారీగా పతనమయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గించింది. అయితే ఏప్రిల్ 1 నుంచి మాత్రం జీఎస్ 6 నిబంధనల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా.. డీజిల్ రూ.65.34కి విక్రయించారు.
సోమవారం (మార్చి 9, 2020) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
2014-15లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 84.16 డాలర్లుగా ఉంది. ఇది 2019 డిసెంబర్ నాటికి 63.98 డాలర్లుగా, ప్రస్తుతం అంటే 2020, మార్చి నాటికి 37 డాలర్లకు చేరింది. మొత్తంమీద 2014తో పోల్చిచూస్తే దాదాపు 50 డాలర్లు తగ్గింది. ముడి చమురు 5 డాలర్లు తగ్గితేనే భారత్‌కు 12-13 బిలియన్ డాలర్ల(84 వేల కోట్లు) మేర విదేశీమాదక ద్రవ్యం ఆదా అవుతుంది. అంటే 2014తో పోల్చుకుంటే 2019 నాటికి బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్ల మేర తగ్గింది. ఆ లెక్కన ఆయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు అయ్యే విదేశీ మారక ద్రవ్యం 3 లక్షల 50 వేల రూపాయలు మిగిలింది.
దీనికి అదనంగా ఆయిల్‌పై 2014-15లో రూ.1.26 లక్షల కోట్లుగా ఉన్న పన్ను వసూలు, 2018-19 నాటికి అదనంగా దాదాపు రూ.1.53 లక్షల కోట్ల మేర పెరిగి రూ.2.79 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా రాష్ట్రాలు కూడా పన్నులను బాధేశాయి. రూ.1.6 లక్షల కోట్లుగా ఉన్న పన్ను ఆదాయం రూ.2.27 కోట్లకు చేరింది. అంటే అటు ఆయిల్ దిగుమతుల సమయంలో మిగిలిన విదేశీ మారక ద్రవ్యం, అటు పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం కలిపి దాదాపు రూ.5.7 లక్షల కోట్ల సొమ్ము మిలిలింది. ఈ సొమ్మునంత టినీ మోడీ సర్కార్ వివిధ రూపాల్లో కార్పొరేట్లకు దోచిపెట్టి సాధారణ ప్రజలకు మాత్రం వాతలు పెడుతోంది.