English | Telugu

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ఢీకొని యువతి మృతి

హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్ 12 లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై వెళ్తున్న యువతి స్పాట్ లోనే చనిపోయింది. బస్సు టైర్ యువతి తల పై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జయింది. బస్సు నడుపుతున్న వ్యక్తి తాత్కాలిక డ్రైవర్ కావడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పని చేస్తున్న సోహినీ సక్సేనాగా గుర్తించారు పోలీసులు.

బర్కత్ పురాకి చెందిన బస్ డ్రైవర్ బస్సును అతి వేగంగా నడపడం వల్ల ఎదురుగా వస్తున్న యువతి స్కూటీ దిగుతుండడంతో స్కూటీ బస్సు టైర్ల మధ్య ఇరుక్కు పోయింది. దీనితో మహిళ స్పాట్లోనే చనిపోయింది.అదే బస్సులో ఉన్న ప్రయాణికులు మరియు అక్కడి స్థానికులు ఆ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. ప్రమాదం జరిగిన స్పాట్ లో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు స్థానికులు. గత మూడేళ్లలో అదే స్పాట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అతివేగంగా వెళ్ళడం వళ్ళే జరిగింది. అతనికి బ్రేక్ కంట్రోల్ కాకపోవడం.. ఆ మహిళ పై నుంచి పోనివ్వడం.. వల్లే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ స్పాట్లోనే చనిపోవడంతో పోలీసులు మృతిదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారాని సమాచారం.