English | Telugu

పాత‌బ‌స్తీలో మితిమీరుతున్న అర‌బ్‌షేక్‌ల ఆగ‌డాలు

స్థానిక బ్రోక‌ర్ సాబేర్ అండ‌తో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్ప‌డిన ఇబ్రాహీంషేక్‌
బార్క‌స్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఉదంతం

ఇబ్రాహీం అనే అరబ్ షేక్ బార్క‌స్‌కు చెందిన ఒక మహిళను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిరుపేద అక్కా చెల్లెళ్లు ఆరోపిస్తున్నారు.

హైద‌రాబాద్ ఓల్డ్ సిటీ బార్క‌స్ ప్రాంతానికి చెందిన నిరుపేద అక్కా చెల్లెళ్లు అవ‌స‌రాల‌కు త‌మ ఇల్లు అమ్ముదామ‌నుకున్నారు. వీరు స్థానిక బ్రోక‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళితే, అర‌బ్ షేక్‌ను పెళ్ళి చేసుకోమ‌ని బేరం పెట్టాడంట ఆ బ్రోక‌ర్‌. ఇల్లు కొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పి అక్కాచెల్లెళ్లను తన ఇంటికి పిలిచాడు. నమ్మి వచ్చిన వారి ముందు. అరవైఏళ్ల ఇబ్రహీం అనే అరబ్ షేక్ ను పరిచయం చేశాడు. షేక్‌ను పెళ్లాడాలని బెదిరించాడ‌ట‌. అతడి ప్రతిపాదనను రిజెక్టు చేసిన అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లిపోయారు.

అస‌లే మ‌ద‌మెక్కిన అర‌బ్ షేక్. చెల్లెలిపై మోజు ప‌డ్డాడు. అంతే బ్రోక‌ర్ సాబేర్ ప‌క్కా ప్లాన్‌తో చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న అక్క రాత్రి నుంచి చెల్లెలు కనిపించకుండా పోవటంతో ఆందోళనకు గురైంది.తన చెల్లెలు కనిపించకుండా పోవటానికి కారణం సాబేర్ అని అనుమానించిన ఆమె.. తన సోదరుడితో కలిసి సాబేర్ ఇంటికి వెళ్లింది.

అయితే.. వారిపై సాబేర్ సతీమణి దాడికి పాల్పడింది. కనిపించకుండా పోయిన సోదరి ఆచూకీ కోసం వెతుకుతున్న వారికి బార్కాస్ లోని ఇబ్రహీం ఇంట్లో తమ చెల్లెలు ఉందని గుర్తించారు. బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా చెల్లెల్లు చెప్ప‌డంతో వెంటనే వారు ఇబ్రహీం పాస్ పోర్టు లాక్కొని.. చెల్లెల్ని వారి చెర నుంచి విడిపించుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన అక్కాచెల్లెళ్లు.. తాజాగా పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసి విచారణ జరుపుతున్నారు.