English | Telugu

కటింగ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది... మూడో భర్త ఆవేదన...

జగిత్యాలలో ఓ వింత ఫ్యామిలీ హల్చల్ చేసింది. బైక్ పైనుంచి తనను తోసేశాడంటూ భార్య హాస్పిటల్లో చేరితే... ఫోన్లు చేస్తూ తనను టార్చర్ పెడుతోందంటూ భర్త బోరుమంటున్నాడు. జగిగ్యాలకు చెందిన రాణి, భరత్ భార్యాభర్తలు... ఇద్దరూ కలిసి టూవీలర్ పై వస్తుండగా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది... బైక్ పై వెళ్తూనే వాదులాడుకున్నారు... మాటామాటా పెరిగింది... ఇంతలో ఏమైందో బైక్ పైనుంచి రాణి కిందపడిపోయింది... దాంతో, రాణికి తీవ్ర గాయాలు అయ్యాయి... జగిత్యాల బైపాస్ రోడ్డులో పడిపోయి ఉండటంతో... 108లో ప్రైవేట్ ఆస్పత్రికి రాణికి తీసుకెళ్లారు.... తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న రాణికి ప్రాథమిక చికిత్స చేశారు.

అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించగా... తన భర్తే బైక్ పైనుంచి తోసేశాడంటూ చెప్పింది. దాంతో, అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అయితే, అసలేం జరిగిందని భర్తను పశ్నిస్తే... ఆమె తనతో గొడవ పడుతూ బైక్ పైనుంచి దూకేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఇద్దరి మాటలు విన్న ఆస్పత్రి సిబ్బంది... భార్యాభర్తల మధ్య రోజూ ఉండే గొడవలే కదా అనుకున్నారు. అయితే, అసలు సంగతి చెబుతూ భోరుమన్నాడు రాణి భర్త భరత్. అది విన్న ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. అతడి పరిస్థితిని తలుచుకుని అయ్యో పాపం అనుకున్నారు.

రాణి తనను మూడో పెళ్లి చేసుకుందని, ఆమె తన కంటే పదేళ్లు పెద్దదని ఏడుస్తూ చెప్పాడు భరత్. ఇంట్లో పేషెంట్ ఉన్నాడు... కటింగ్ చేయాలంటూ పిలిచి... తనను ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకుందని ఏడుపు లంకించుకున్నాడు. అంతేకాదు, మా అమ్మానాన్న దగ్గరకి వెళ్తే ఎక్కడున్నావ్ అంటూ ఫోన్లు చేస్తూ విసిగిస్తూ టార్చర్ పెడుతోందని, ఆ విషయంలోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అలా, బైక్ పై గొడవ పడుతూనే కిందకి దూకేసిందని చెప్పాడు. భరత్ మాటలు విన్నాక అక్కడున్నవారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు భార్యాభర్తల్లో ఎవరిని ఓదార్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇదేం వింత ఫ్యామిలీరా బాబూ అంటూ అక్కడ్నుంచి జారుకున్నారు.