English | Telugu

టెన్షన్ టెన్షన్.. లక్నోలో బాంబు పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. కోర్టు వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలో మరో మూడు బాంబులను కనుగొన్న పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. బాంబు పేలుడుతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకేమైనా బాంబులు ఉన్నాయా అన్న అనుమానంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది.