English | Telugu

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడంలేదు?

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గడం లేదు. నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతం మేర తగ్గాయి. బ్యారెల్ ధర 45 డాలర్లకు పడిపోయింది. కానీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. కరోనా వైరస్ కారణంగా చైనా సహా ఇతర దేశాల్లో ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీంతో ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కారణంగా మార్కెట్లు కూలుతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.65 వరకు ఉన్నాయి. 2017 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 54 నుండి 56 డాలర్ల మధ్య ఉంది. అప్పుడు పెట్రోల్ ధర రూ.70, డీజిల్ రూ.58 వరకు ఉంది. ఆ తర్వాత 2018 చివరలో 2019 ప్రారంభంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల వరకు పెరిగాయి. అయినా పెట్రోల్ ధరలు రూ.71, డీజిల్ రూ.64గానే ఉంది. అంటే అంతర్జాతీయంగా పెరిగిన ధరప్రకారం ఇక్కడి రేట్లు పెరగలేదు అని చెప్తున్నారు.

నష్టాలు తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడంలేదు. దేశంలో చమురు ధరల నియంత్రణ మీద కేంద్ర అజమాయిషీ వదులుకున్నాక ఈ పరిస్తితులు ఎడురౌతున్నాయు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ప్రస్తుతం 45 నుండి 50 డాలర్లుగా ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 వరకు తగ్గాలి. అయితే గతంలో అధికంగా ధరలు తగ్గించనందున పెట్రో కంపెనీలు కొంత నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఆ నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు తగ్గించడం లేదని భావిస్తున్నారు. గత దశాబ్దాలుగా ఈ నష్టాలను తగ్గించుకే పనిలోనే చమురు కంపెనీలు ఉన్నా ఆ నష్టాలు ఎందుకు తగ్గవో చమురు ధరలు ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రావో సామాన్యుడికి ఎన్నటికీ సమాధానం లభించని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి మరో కారణం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడిందని గుర్తు చేస్తున్నారు. రూపాయి మారకం గత ఏడాది రెండేళ్లలో రూ.68 నుండి రూ.72కి పడిపోయిందని, ఈ లెక్కన ధరలు రూ.2 వరకు అధికంగా ఉండాలని చెబుతున్నారు.

భారీ తగ్గుదల కాగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. గత శుక్రవారం ఏడాదిలోనే ఒకేరోజు గరిష్టంగా తగ్గాయి. అదే సమయంలో 2016 తర్వాత వరుసగా వారం రోజుల్లో భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. బ్రెంట్ క్రూడాయిల్ 4 శాతం తగ్గి 49.67 వద్ద ఉంది. 2017 జూలై నుండి ఇది అత్యంత కనిష్టం.

ప్రస్తుతం చమురు ధరలు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.72.10లు. విజయవాడలో రూ.76.69లు. డీజిల్ ధర డిల్లీలో 16 పైసలు క్షీణతతో రూ.65.07లు మన దగ్గర రూ.70.91లు ఉంది. దేశ రాజధానికి రాష్ట్రాలకు మద్య ధరల్లో ఈ వ్యత్యాసం ఎందుకుందో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్రాలు కొంతమేర పన్నులు తగ్గిస్తే తమకుఊరట కలుగుతుందని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.