English | Telugu

నారాయణా..హరి..జగన్.. నారాయణా..గోవిందా..ఇదీ ప్రస్తుత ఏపీ పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చిరంజీవిలానే ఉన్నారు. ఏంటి..ఇదేంటి ఈ వెబ్ సైట్ ఇలా రాసింది..అనుకుంటున్నారా.. ఈ వార్త చూసాక కొంతమందికి అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన ముఠామేస్త్రి సినిమా గుర్తొచ్చినా తప్పులేదు... ఎందుకంటే ఈ వార్త చూస్తే గుర్తు రాక తప్పదు కూడా. ఇంతకీ వార్త ఏంటి అని బుర్ర బద్దలు కొట్టుకోకండి..
ఇదుగో..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటుమద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకుమద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకుమద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్చ్..ఇందులో కొత్త వార్త ఏముంది? అనుకుంటున్నారా..
కాస్త ఆలోచించండి..అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖామాత్యులు. ఆయన ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం సరఫరా నిలిపి వేస్తున్నామని ప్రకటించారు..అదన్న మాట..వార్త.
ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఏక్సైజ్ శాఖ, దానికి మంత్రి లేరా..ఉన్నారు కదా..ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నారాయణ స్వామి కాదా..అని ఎవరికైనా డౌటానుమానాలు వస్తే.. నారాయణ..నారాయణ.. మాది బాధ్యత కాదు సుమా..
జస్ట్ అనిల్ గారికి ముఠామేస్త్రీలా మారాలనిపించిందేమో..నారాయణా..

ఈ వార్త చదివాక ఏపీ ప్రజలు తమని తాము.. మొన్నామధ్య గ్రామీణ ఎన్నికల నేపథ్యంలో చిరు తనయుడు రాంచరణ్ రంగస్థలం సినిమాలో గొంతు కొస్తే మాట రాక పెదాలు కదల్చిన చిట్టిబాబు అన్నయ్య క్యారెక్టర్ లో చూసుకుంటే అసలేం చేయలేము..సారీ..