English | Telugu
గీతంకు వర్సిటీ హోదా తొలగించండి.. యూజీసీకి, హెచ్చార్డీకి ఎంపీ విజయ్ సాయిరెడ్డి లేఖ
Updated : Oct 29, 2020
గీతం సంస్థ విశాఖ క్యాంపస్ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. గీతం సంస్థ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. గీతం విద్యా సంస్థకు.. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ చైర్మన్గా ఉన్న సంగతి తెలిసందే.