English | Telugu

వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య

హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్ ఎండీ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అంటూ ఏడు పేజీల సూసైడ్ నోట్ రాశారు అజయ్. వైష్ణవి ఆసుపత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, అతడి బావమరింది కొండల్ రెడ్డితో పాటు సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగా రెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ తనను మానసికంగా వేధించారని అందులో పేర్కొన్నారు అజయ్.

ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వ్యక్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక వారిని విచారించి ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెల్లడించనున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఈ కేసు విచారణ వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఆ నలుగురు వ్యక్తులు దొరికే వరకు నిజానిజాలు తెలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.