English | Telugu

జగన్ కి షాక్.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే!

విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా.. విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపునపై స్టే విధిస్తినట్లు హైకోర్టు పేర్కొంది.

విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ.. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై స్టే విధించింది.