English | Telugu
ఏపీ రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Updated : Feb 4, 2020
ఏపీ రాజధాని అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధానిపై నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ కేంద్రం తెలిపింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోని అంశం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో కేంద్రం కలగజేసుకోలేదని నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.