English | Telugu

లెక్కల మాస్టారు దెబ్బకి విలవిల్లాడుతున్న ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎప్పుడో మరిచిపోయిన రాచరికాన్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తున్నారని,విజయసాయిరెడ్డి పట్ల అసంతృప్తిలో కూరుకుపోయారు ఉత్తరాంధ్ర బీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సాయి రెడ్డి పెత్తనమేనా అంటూ పెదవి విరుస్తున్నారు. సాయి రెడ్డి దెబ్బకి విశాఖ జిల్లాలో మంత్రి ఆ అవంతి జీరో అవుతున్నారని ఆయన అనుచరులు వేదన పసుతున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలకు రాచరికం కొత్త కాదు కానీ అది చరిత్ర.కానీ ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్ర లో రాచరికం అనే పదం వినపడుతుంది.అది కూడా వైకాపా నాయకుల నోటిలో ఈ పదం ఎక్కువుగా నానుతొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో 30 ఏళ్ళు చక్రం తిప్పిన బీసీ నాయకులు సైతం వామ్మో సాయి రెడ్డి అనే పరిస్థితి వచ్చింది.రాజధాని వస్తే మన హవా పెరిగిపోతుంది అని భావించిన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు అంతా స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలతో డైలమాలో పడ్డారు.

ఉత్తరాంధ్ర బీసీ నాయకులకు సాయి రెడ్డి ఇస్తున్న షాక్ లు అన్ని,ఇన్ని కావు. తమ వర్గానికి స్థానిక ఎన్నికల్లో న్యాయం చెయ్యాలి అని భావించిన ఉత్తరాంధ్ర బీసీ నాయకులకు సాయి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.ఆఖరికి స్థానిక ఎన్నికల్లో కూడా తన కనుసన్నల్లో ఉండే నాయకత్వానికే సీట్లు ఇప్పించుకొని విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ లో తిరుగులేని శక్తిగా చలామణి కావడం స్థానిక నేతలకు మింగుడుపడటం లేదు.అసలు ఉత్తరాంధ్ర లో మంత్రులు ఉన్నారా?వారికి అక్కడ కనీస గౌరవం కూడా లేదు.ఏ చిన్న పని అయినా మంత్రి దగ్గరకి వెళ్లే వాడే లేడు అందరూ సాయి రెడ్డి కోటరీ తలుపులే కొడుతున్నారు. దింతో ఉత్తరాంధ్ర వైకాపా నాయకత్వం ఏకతాటి పైకి వస్తుంది.స్థానికేతరుడి పెత్తనం పై తిరగబడాలని నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ జిల్లా లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మంత్రి అవంతి స్థితి అయితే తనలో అగ్ని పర్వతం పేలిపోయే పరిస్థితికి చేరిపోయింది అని సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పాలని అవంతి స్కెచ్ గీసినా అందుకు సాయి రెడ్డి బ్రేకులు వేసారు.విశాఖ మేయర్ పదవి నీకే అని గతంలో జగన్ బీసీ నేత వంశి కృష్ణ యాదవ్ కి హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడు సీన్ మారింది సడెన్ గా ఎమ్మెల్యే సీటు దక్కక పార్టీ కి గుడ్ బై చెప్పిన విజయ్ కుమార్ ఇప్పుడు మేయర్ అభ్యర్థి గా దాదాపు ఖాయం అయ్యింది అని చర్చ జరుగుతుంది.దింతో అసలు విశాఖ వైకాపా పయనమెటు అంటూ నాయకుల్లో చర్చ మొదలయ్యింది.రాజధాని ఏర్పాటు లో ఎలాగో మాకు వాటా దక్కడం లేదు.స్థానిక ఎన్నికల్లో కూడా స్థానికేతరుడు అయినా సాయి రెడ్డి పెత్తనమేనా అంటూ నాయకుల్లో చర్చ తారాస్థాయికి చేరుకుంది.అసలు విశాఖ జిల్లా లో వైకాపా నాయకులకు విలువ లేదు,ఏ పని కావాలన్నా సాయి రెడ్డి అంటే ఇక మేము రాజకీయాల్లో ఉండటం ఎందుకు అంటూ ఒకరి భాద మరొకరితో చెప్పుకుంటూన్నారట.