English | Telugu
సీఎం జగన్ కు ఉండవల్లి లేఖ
Updated : Jul 30, 2020
కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీఓలు, ట్రస్ట్ లకు అప్పగించాలని సూచించారు. ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని.. ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే ఒక కళ్యాణ మండపం అద్దెకు తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించి, ఫీజును ప్రభుత్వం నిర్ణయించాలని అన్నారు.