English | Telugu

యుకె ప్రధాని బోరిస్ ఆరోగ్యం మెరుగుపడింది!

కరోనా రాకాసి బారిన పడిన యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు. ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, మ‌రి కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని డాక్ట‌ర్లు వెల్లడించారు. ప్ర‌ధాని ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో ప్ర‌స్తుతం ఐసీయూ నుంచి సాధార‌ణ వార్డుకు త‌ర‌లించారు.

ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతల భుజాన వేసుకుని నిర్వ‌హిస్తున్నారు.