English | Telugu
మహా ముఖ్యమంత్రిగా ఉద్ధవ్... డిప్యూటీలుగా జయంత్, థోరాట్
Updated : Nov 27, 2019
మొత్తానికి అనుకున్నది సాధించారు. మరాఠా అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అనేక మలుపులు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అందుకోబోతున్నారు. డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్ బాలా సాహెబ్ థోరాట్ ప్రమాణం చేస్తారు.
బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ముందడుగు వేసింది. ముంబైలో సమావేశమైన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను అందజేశారు.
ఇక, గవర్నర్ ఆదేశాలతో ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభంకానున్న సభ.... ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత ముగియనుంది. ప్రొటెం స్పీకర్ కాళిదాస్... నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.