English | Telugu
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం
Updated : Nov 27, 2019
వేగం ప్రాణాలు తీస్తున్నా.. వాహనదారుల్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. అతివేగం.. నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వారంలో ఇది మూడో యాక్సిడెంట్. ఎల్బీనగర్- దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై అన్‌లిమిటెడ్ మాల్ దగ్గర ప్రమాదం జరిగింది.అతివేగంతో కారు దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అదే వేగంతో కారు పల్టీలు కొడుతూ వెళ్లి మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు..యాక్సిడెంట్ లో గాయపడిన మహిళలను ఓజోన్ ఆసుపత్రికి తరలించారు.
రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళలను వెంకటమ్మ , సత్తెమ్మగా గుర్తించారు పోలీసులు. ఇద్దరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగమే కారణమని దర్యాప్తులో పోలీసులకు తెలిపారు స్థానికులు. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ AP9 AB 5436 మీద ఏవైనా పాత కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరువుతున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ కాగా.. ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్థానికులు షాక్ కి గురయ్యారు. ఇలా అతివేగంతో నడిపే వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని మండిపడ్డారు స్థానికులు.