English | Telugu

డ్రాగన్ నెక్స్ట్ గన్ మన వైపే గురి...

* కరోనా కారణంగా షార్ట్ బ్రేక్ తీసుకున్న చైనా..
* అప్పిచ్చిన దేశాల పీక ఇప్పటికే నొక్కేసిన చైనా ...
* ఆర్ధిక గుత్తాధిపత్యం కోసం చైనా వికృత జూద క్రీడ ...
* ఇండియా తన విదేశాంగ విధానాన్ని పునస్సమీక్షించుకోవాలి ...
* ప్రపంచాన్ని చాప కింద చుట్టేసిన చైనా ...
* డ్రాగన్ నెక్స్ట్ గన్ మన వైపే గురి ...
* ఇప్పటికైనా , మన దేశం చైనా వస్తు బహిష్కరణ దిశగా అడుగులు వేయాలి
* నాసిరకం వస్తువులతో మన ఆర్ధిక వ్యవస్థ మీద దాడి చేస్తున్న చైనా పై తిరుగుబాటుకు మనం మరొక 'స్వదేశీ' ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకువెళ్ళాలి
* కరోనా పై సమష్టి గా చేస్తున్న ఈ యుద్ధం, మరొక స్వతంత్ర సంగ్రామం కావాలి

ఇది ఒక ప్రపంచ పర్యాటకుడి పరిశోధన.. నిశిత పరిశీలన మూడేళ్ళ పాటు ప్రపంచమంతా పర్యటించి వచ్చిన తర్వాత, తన కళ్ళ ముందు కనపడుతున్న కఠోర వాస్తవాలను ఆయన సాంతం షేర్ చేసుకున్నారు.. ఈ కథనం అంతా చైనా ఆర్ధిక దుర్నీతికి బలైపోయిన చిన్ని చిన్ని బడుగు దేశాల నుంచి ఓ మోస్తరు ఆర్ధికంగా బలపడుతున్న దేశాలు కూడా ఇందులో ఉన్నాయి.

మన భారత దేశం దిగివన్ ఉన్న ద్వీప దేశం శ్రీలంకను చూశారు గదా... ఆ దేశం అభివృద్హికి చాలా డబ్బు అవసరం... ఆ డబ్బు చైనా దగ్గర ఉంది... ఇంకేం... శ్రీలంక చైనా దగ్గర 2. 8 బిలియన్ డాలర్ల అఫీషియల్ డెవెలప్మెంట్ అసిస్టెన్స్ ( ఓ డీ ఏ ) తీసుకుంది. ఈ ఓ. డి. ఏ. కింద సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఋణం మంజూరు చేయటం జరుగుతుంది. అంతా బానే ఉంది....శ్రీలంక ఆ చైనా చేసిన సాయంతో ఆకాశ హర్మ్యాలు నిర్మించింది... హై వేస్ , ఎయిర్ పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్ నిర్మించింది.. దేశ ప్రగతిని ఉర్రూతలూగుతూ పరుగెత్తించింది.. కానీ,కొన్నేళ్ల తర్వాత ఏం జరిగింది.. వడ్డీ రేట్ల తో సహా ఆ డబ్బుని చైనా ముక్కు పిండి మరీ వసూలు చేయటం మొదలెట్టింది. శ్రీలంక ప్రగతి, సంక్షేమం సరే... ఆ దేశ సామాన్యుడి జేబుకి , దేశ ఖజానాకు భారీగా చిల్లు పడిందనే విషయం తెలిసొచ్చేప్పటికీ శ్రీలంక శోష వచ్చి పడిపోయినంత పరిస్థితి ఏర్పడింది. అప్పు తీర్చలేని దుస్థితిలోకి శ్రీలంక పూర్తిగా కూరుకుపోయింది. ఫలితంగా తమ దేశం నిర్మించిన అన్నింటి మీదా శ్రీలంక కంట్రోల్ తప్పిపోయి, అవి పూర్తిగా చైనా స్వాధీనం లోకి వెళ్లిపోయాయి. నీతి ఏమిటంటే- ఊరక ఇస్తున్నాడు కదా అని అప్పు తీసుకుంటే, చైనా లాంటి డ్రాగన్ ఇలాంటి ఆర్ధిక దురాక్రమణ లకు పాల్పడి, అలాంటి చిన్ని దేశాలను పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకుంటుందన్న మాట. ఇది శ్రీలంక కు దెబ్బనుకుంటే, మనం భారతీయులుగా పప్పులో కాలేసినట్టే. మన చుట్టూ ఉన్న ఇలాంటి దేశాలను ఆర్ధికంగా తన కంట్రోల్ లోకి తీసుకోవటం ద్వారా , చైనా భారత్ మీద ముప్పేట దాడికి సిద్ధమవుతోందనేది దీని భావం అని అర్ధం చేసుకోవాలి. దీన్నే అంతర్జాతీయ భాష లో చైనీస్ మనీ ట్రాప్ అంటారు.

కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టె ఇలాంటి ట్రాప్ టెక్నాలజీ లో ఆరి తేరిన చైనా చేతికి చిక్కిన శ్రీలంక, చివరకు తాము నిర్మించిన షిప్పింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఆకాశ హర్మ్యాలు, హై వే లన్నిటి మీద చైనా కు అధికారాన్ని ధారాదత్తం చేసి, ఇప్పుడు ఆడియెన్స్ గ్యాలరీకి పరిమితమైపోయింది. తమ ఆర్ధిక ఉద్దీపన కేంద్రాలన్నీ అలా చైనా హస్తగతమవటం, శ్రీలంకకు పెను విషాదం. కానీ, చైనా దగ్గర తీసుకున్న చెల్లించలేని భారీ రుణానికి, అంతకు మించిన మూల్యమే శ్రీలంక ఇప్పటికీ చెల్లించుకుంటోంది.

ఇక, పపువా న్యూ గినియా అయితే, చైనా నుంచి రెండు బిలియన్ డాలర్ల ఋణం తీసుకుంది.. ఎందుకంటే...శ్రీలంక మాదిరే ఇన్ఫ్రా అభివృద్ధి కోసం, ప్రత్యేకించి ఆకాశ హర్మ్యాలు, సీ పోర్టుల నిర్మాణం కోసం... ఈ నిధులు ఖర్చు పెట్టింది.. ఆ నిరుపేద దేశం.. అయితే, ఇపుడు అసలు కాదు కదా, కనీసం వడ్డీ కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ దేశం.. ఇక ఆ దేశం ముందు మిగిలిన ఏకైక మార్గం..తమ దేశం మీద చైనా కి ఆధిపత్యాన్ని ధార పోయటం..

ఎంత దుర్మార్గం, అన్నం పెట్టిన చేత్తోనే, కంచం లాగేయటం.... కానీ, చైనా వ్యవహారమే అది... తాను తప్పించి, మిగిలిన ప్రపంచాన్ని , మనుషులను తమ ఆర్ధిక కేంద్రాలకు పునాదులుగా చేసుకునే ఒక వికృత క్రీడా చైనీయుల రక్తంలోనే ఉండిపోయిందనేది కఠోర వాస్తవం.

మాల్దీవ్స్, పాకిస్తాన్, మలేషియా, లావోస్, కజకిస్తాన్, మంగోలియా, ఈజిప్టు, కెన్యా, సౌత్ ఆఫ్రికా లలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇవే కాదు, ఇంకా చాలా దేశాలు చైనా నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని స్థితిలోకి అనివార్యంగా నెట్టబడ్డాయి. ఆయా దేశాలు నిర్మించుకున్న ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, బ్రిడ్జి లు అన్నీ కూడా -చైనా దేశానికి సముద్ర మార్గం ద్వారా కానీ, రోడ్డు మార్గం ద్వారా కానీ కనెక్ట్ అవుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హ మైన విషయం. వీటన్నింటినీ కూడా బ్రిడ్జిల అనుసంధానం గానో, పోర్టుల అనుసంధానం గానో కాదు చూడాల్సింది. చైనా దగ్గర అంతకు మించిన ఆర్ధిక దురాక్రమణ తాలూకు విస్తృతి, ఇందులో నిగూఢంగా దాగి ఉన్న అంశం.. ఇప్పటికే ఒక విషయం అర్ధం అయ్యుండాలి.. ప్రపంచాన్ని చైనా నిర్మిస్తోంది నెమ్మది నెమ్మదిగా... ఆ తర్వాత జరిగేది, మిగిలింది కూడా చైనా ప్రపంచాన్ని తన గుప్పిట లోకి తెచ్చుకోవటమే. షిప్పింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇన్ఫ్రా, హై వేస్, బ్రిడ్జిలు, ఇవన్నీ ఒక దేశ ప్రగతికి సూచికలు కావచ్చు కాక... కానీ, వాటన్నింటి తాలూకు అప్పులు చెల్లించలేని స్థితి లో ఆ దేశాలు నిలువ గూడు లేని దుస్థితి లోకి నెట్టబడుతాయి. ఇది చైనా జూద క్రీడ.

మన పెద్దలు చెప్పే మాట ఇక్కడ ఓ సారి గుర్తు చేసుకోవాలి.... ఎక్కడా కూడా, ఎపుడూ కూడా ఫ్రీ లంచ్, ఫ్రీ రైడ్ ఉండవు.. మనం డబ్బు దగ్గర జాగ్రత్త గా లేకపోతె, అది ప్రజల డబ్బు, లేదా జాతి సంపద కూడా కావచ్చు.. చైనీస్ ఆర్ధిక జూద క్రీడ లో శలభాల్లా మాడి మసైపోవటం ఖాయం.. చైనా ప్రస్తుతం ఈ క్రీడకు 'కరోనా వైరస్' తో విరామం ప్రకటించి ఉండవచ్చు కానీ, షార్ట్ బ్రేక్ తర్వాత, ఆ డ్రాగన్ మళ్ళీ మనమీదే , అంటే నేరుగా భారత దేశం మీదే విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇది భయపెట్టడం కాదు... జాగ్రత్త పడమని చెప్పడం.. మన విదేశాంగ విధానాన్ని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పటం..
అంతే కాదు.. ఇపుడు మనం సీరియస్ గా చైనా వస్తు బహిష్కరణ కు నడుం బిగించాలి. దేశం మొత్తాన్ని సంఘటితం చేయాలి. సెకండ్ గ్రేడ్ వస్తువులను మన దేశం లోకి డంప్ చేస్తున్న థర్డ్ గ్రేడ్ కంట్రీ చైనా పై మనం సమర శంఖం పూరించాలి. బాబా రామ్ దేవ్ చెప్పినట్టు-ఇది యుద్ధ సమయం, చైనా ను, చైనా వస్తువులను మనం బహిష్కరిద్దాం. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం.

చైనా కు రుణ పడి ఉన్న దేశాల వివరాలు పట్టిక రూపం లో ఈ దిగువన ఇస్తున్నాం:
చైనా అధికారిక ఆర్ధిక సహాయ కార్యక్రమం ఒక సారి చూస్తే, ఈ రంగం లో ఉన్న పేరు గడించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కన్నా కూడా, చైనా అతి తక్కువ రాయితీలతో కూడిన ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయం మనకు బోధపడుతుంది.

Official Development Assistance (ODA) కింద ఈ కింది దేశాలు చైనా ఋణం తీసుకున్నాయి.


Cuba ($6.7 billion)
Cote d'Ivoire ($4.0 billion)
Ethiopia ($3.7 billion)
Zimbabwe ($3.6 billion)
Cameroon ($3.4 billion)
Nigeria ($3.1 billion)
Tanzania ($3.0 billion)
Cambodia ($3.0 billion)
Sri Lanka ($2.8 billion)
Ghana ($2.5 billion)

Other Official Flows (OOF) స్కీం కింద, ఈ కింది దేశాలు చైనా నుంచి ఆర్ధిక సాయం పొందాయి.

Russia ($36.6 billion)
Pakistan ($16.3 billion)
Angola ($13.4 billion)
Laos ($11.0 billion)
Venezuela ($10.8 billion)
Turkmenistan ($10.1 billion)
Ecuador ($9.7 billion)
Brazil ($8.5 billion)
Sri Lanka ($8.2 billion)
Kazakstan ($6.7 billion)