English | Telugu
తెలంగాణలో పాజిటివ్ సంఖ్య 332కు పెరిగింది! ఆదివారం 62 కేసుల నమోదు!
Updated : Apr 5, 2020
తెలంగాణలోని పది జిల్లాల్లో వైరస్ విజృభిస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా లో23 కరోనా కేసులను గుర్తించారు. నిజామాబాద్ (19), నల్గొండ (13), మేడ్చల్ (12), ఆదిలాబాద్ (10), కామారెడ్డి (8), కరీంనగర్ (6) ఉన్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల తరువాత హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.