English | Telugu

కొత్త‌గా మ‌రో 10 పాజిటివ్ కేసులు! తెలంగాణాలో 59కి పెరిగిన పాజిటివ్ కేసులు!

తెలంగాణాలో 59 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. 20 వేల మంది క్వారెంటైన్‌లో వున్నారు. ఈ ఒక్క రోజే శుక్ర‌వారంనాడు 10 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి.
ఇండియాలో 20 కోట్ల మంది క‌రోనాబారిన ప‌డే ప్ర‌మాదం వుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్వీయ‌నియంత్ర‌ణే శ్రీరామ‌ర‌క్ష‌. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌ద్దు. ఏమైత‌దిలా అనే నిర్ల‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని చేతులెత్తి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధానితో మాట్లాడాను. అండ‌గా వుంటామ‌ని పి.ఎం. భ‌రోసా ఇచ్చారు.

ప్ర‌పంచ‌మంతా ఇదే ప‌ద్ద‌తి పాటిస్తోంది. ఏం చేస్తున్నారంటే 80 శాతం ఇళ్ల వ‌ద్దే పెట్టి చికిత్స చేస్తున్నారు. 13శాతం, 4 శాతం బాధితుల్ని ఆసుప‌త్రిలో పెట్టి చికిత్స చేస్తున్నారు. పూర్తిగా స్ట‌డీ చేస్తున్నాం. ఎంత వ‌ర‌కు దీన్ని ఎదుర్కోగ‌లం? 100 మంది అవ‌స‌రం అయితే 130 మందిని సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామ‌ని సి.ఎం. చెప్పారు.
ఒక్కో ద‌శ‌లో 4 వేల మంది ఐసొలేష‌న్ వార్డులో వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. 1400 ఐసిఎం బెడ్స్ సిద్ధం చేస్తున్నాం. గ‌చ్చిబౌలీలో స్టేడియం పూర్తిగా అందుబాటులో రానుంది. కింగ్‌కోఠి ఆసుప్త‌రిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం.
500 వెంటిలేట‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిం.
12 వేల మంది బెడ్స్ సిద్ధం చేసుకొని వున్నాం. 60 వేల మంది బాధితులున్నా స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా వున్నాం.
8 వేల మంది వైద్యులు స‌ర్కార్ ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్నారు. వారే కాకా ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారి స‌మాచారం తీసుకొని 14 వేల మందిని సిద్ధం చేసుకుంటున్నాం.
ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్ల‌క్ష్యం, అల‌స‌త్వం వ‌హించ‌కుండా భ‌యంక‌ర విప‌త్తులో భ‌యంక‌ర రాక్ష‌సితో యుద్ధం చేస్తున్నాం. ఈ ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు స‌హ‌కారం చేయాలి.
తెలంగాణాలో వున్న ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల క‌డుపు నింపుతాం. ఆందోళ‌న చెంద‌కండి. హాస్ట‌ల్ బంద్ అయిందంటూ రోడ్ల మీద ప‌డ‌వ‌ద్దు అని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.