English | Telugu

ఆర్టీసి కార్మికుల డిమాండ్లపై మొదలయిన చర్చ...

ఆర్టీసి కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. వాళ్ళు ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఆర్.టి.సి సమస్యలపై రెండు గంటల పాటు చర్చించిన మంత్రి వర్గం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

సీనియర్ ఐఏఎస్ లు సోమేష్ కుమార్, రామకృష్ణా రావు సునీల్ శర్మలతో చర్చలు జరపవచ్చు అని చెప్పింది. ఆ ఆదేశాల ప్రకారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో చర్చలు మొదలయ్యాయి. డిమాండ్ లకు సరే అని చెబితే సమ్మె విరమించుకుంటామని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగ సంఘాల నేతల ముఖ్య డిమాండ్లు ప్రభుత్వంలో ఆర్.టి.సి కార్మికులను విలీనం చేయాలి, అలాగే కొత్తగా రిక్వైర్ మెంట్ లు తీసుకోవాలని కోరుతున్నారు.

తమ డిమాండ్లను అంగీకరిస్తే సమ్మె పూర్తిగా విరమిస్తామని ఆర్.టీ.సీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ లోని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయంలో దీనికి సంబంధించి కమిటీ మీటింగ్ ప్రారంభమైంది. దీంట్లో ఆర్.టీ.సీ యూనియన్ మెంబర్ అశ్వరామశర్మ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగే ఈ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా అన్నది చర్చ తరువాత తెలియనుంది.