English | Telugu

పసిబిడ్డను తొట్టిలో పడేసిన కిరాతకుడు

కంటికి రెప్పలా ఉండాల్సిన వాడే కాలయముడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రేగుంట ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఊహకందని దారుణం కళ్ల ముందుకు వెలుగులోకి వచ్చింది. ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డను తొట్టిలో పడేసి చంపాడు ఒక కిరాతక తండ్రి. కంటే కూతుర్నే కనాలి, మనసుంటే మగాడిలా పెంచాలి ఈ మాట అక్షర సత్యం. అన్ని రంగాల్లో ఆడపిల్లలూ దూసుకెళ్తున్నారు కానీ ఈ కాలంలో కూడా ఇంకా వివక్ష కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే రెంటాల గ్రామంలో జరిగిన ఈ దారుణమైన సంఘటన. కానీ ఇంత ఘోరానికి పాల్పడ్డాడు ఒక కన్న తండ్రి. అందరిలోనూ విషాదం నెలకొల్పింది ఈ ఘటన. వివరాళ్లోకి వెళ్తే సూర్యతేజ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్ ఇదే గ్రామానికి చెందిన అఖిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇతని ప్రేమ పెళ్లికి సూర్యతేజ తలిదండ్రులు అంగీకరించలేదు. దాంతో అత్తగారింటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. మొదట్లో బాగానే ఉండేవాడు వీళ్ళ అన్యోన్యతకు గుర్తుగా ఓ పాప పుట్టింది. బిడ్డను కూడా బాగా చూసుకునేవాడు. గారభం చేసేవాడు అంతా బాగానే ఉంది.వారికీ మళ్ళీ రెండవ పాప పుట్టగా ఇతడిలో ఉన్మాదం చోటు చేసుకుంది. ఒక రోజు ఊరు ఊరంతా కలిసి సూర్యతేజ చేతులు కట్టేసి చితక్కొట్టేశారు. కొట్టడం కాదు ఇలాంటోడిని ఏం చేసినా ఫర్వాలేదని ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. ఒళ్లు హూనమైనా సరే సూర్యతేజ మాత్రం తేలుకుట్టిన దొంగలా నల్లిల ఉండిపోయాడు. కోపాన్ని అదుపు చేసుకున్న గ్రామస్తులు సూర్యతేజను చర్ల పోలీసులకు అప్పగించారు. అతడు చేసిన నిర్వాకం తెలిసి ఖాకీలు సైతం విస్తుపోయారు.మరోవైపు సూర్యతేజను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అఖిల పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్లింది. తన ఒళ్లో ఉండాల్సిన చిట్టితల్లి మార్చురీలో ఉందని తెలిసి తల్లడిలిపోయింది ఆ తల్లి. ఇంకా నెల కూడా నిండని ఆ చిట్టి తల్లికి నూరేళ్లు నిండిపోయాయి. అఖిల సూర్యతేజల రెండో కూతురు అప్పుడే అనంత లోకాల్లోకి వెళ్లిపోయింది.'బేటీ పడావ్ బేటీ బచావో ' అనే నినాదం పెరిగిపోతున్నా ఈరోజుల్లో రెండోసారీ ఆడకూతురే పుట్టిందని సూర్యతేజ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యభర్తల మధ్య విబేధాలు ప్రేమ పెళ్లిని అంగీకరించని తల్లిదండ్రుల నుంచి వేధింపులు కూడా తిరిగి ఈ పసికందుకు నూరేళ్లు నిండిపోయేలా చేశాయి.