English | Telugu
విద్యార్థిపై టీచర్ ప్రతాపం.. చర్మం ఎర్రగా కందిపోయింది!
Updated : Feb 12, 2020
హైదరాబాద్ నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్. సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో ప్లాస్టిక్ స్కేల్ తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో.. విద్యార్థి చర్మం ఎర్రగా కందిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోని టీచర్.. రాక్షసంగా అరగంట పాటు కొట్టిందని.. ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలిపాడు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకొండి అంటూ బెదిరించారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. ‘క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించి.. ఆ టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.